Leading News Portal in Telugu

BCCI Introduces “10-Point Policy” to Restructure Team India


  • టీమిండియా ప్రక్షాళనను మొదలు పెట్టిన టీమిండియా.
  • 10 పాయింట్ల’ పాలసీ తీసుకరాబోతున్న బీసీసీఐ.
  • జట్టులో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం కోసమే బీసీసీఐ నిర్ణయం.
BCCI: టీమిండియా ప్రక్షాళన కోసం ‘10 పాయింట్ల’ పాలసీ తీసుక రానున్న బీసీసీఐ!

BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 10 కొత్త నిబంధనలను జారీ చేసేందుకు సన్నద్ధమైంది. ఇది టీమిండియా ఆటగాళ్లందరూ తప్పనిసరిగా అనుసరించాలి. వీటిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు కఠిన శిక్షలు కూడా విధించబోనుంది బీసీసీఐ. నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీఎల్ నిషేధం, జీతం కోత వంటి అంశాలు తీసుకురానున్నారు. నిజానికి ఇదంతా జట్టులో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం కోసమే అంటూ సమాచారం. ఇక బీసీసీఐ జారీ చేసిన మొత్తం 10 నియమాలు ఏమిటో ఒకసారి చూద్దాం.

* భారత జాతీయ జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లందరూ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్నారు. వీరంతా దేశవాళీ క్రికెట్‌తో క్రమం తప్పకుండా అనుబంధం కలిగి ఉండాలి. ఒకవేళ ఆటగాడికి సమస్య ఉన్నట్లయితే, అతను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నుండి అనుమతి తీసుకోవాలి.

* మ్యాచ్‌ల కోసం లేదా ప్రాక్టీస్ సెషన్ కోసం ప్రయాణించే ఆటగాళ్లందరూ కలిసి ప్రయాణించడం తప్పనిసరి. ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలిసి ప్రయాణించేందుకు అనుమతించబోమని బోర్డు స్పష్టం చేసింది.

* ప్రయాణ సమయంలో ఆటగాళ్లు అధికంగా లగేజీని తీసుకోకుండా నిషేధించబడతారు. ఆటగాళ్ళు ఇప్పుడు 150 కిలోల వరకు లగేజీని, సహాయక సిబ్బందిని 80 కిలోల వరకు ఒకే ప్రయాణంలో తీసుకెళ్లవచ్చు. ఎవరైనా ఆటగాడు ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, అతను స్వయంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

* బీసీసీఐ అనుమతి లేకుండా ఆటగాళ్లు తమతో వ్యక్తిగత సిబ్బందిని (మేనేజర్, కుక్ మొదలైనవి) ఏ పర్యటన లేదా సిరీస్‌కు తీసుకెళ్లలేరు.

* ఇప్పటి దాకా స్టార్‌ క్రికెటర్లకు వ్యక్తిగత రూమ్‌లు ఇచ్చింది బీసీసీఐ. ఇకపై కేవలం సహచర ప్లేయర్లతో కలిసి ఉండేలా రూమ్‌ను షేర్ చేసుకోవాలి. అయితే కుటుంబం వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఉండేందుకు అనుమతి వస్తుంది.

* ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ సెషన్‌లలో పాల్గొనాలి. బస చేసిన ప్రదేశం నుండి మైదానానికి కలిసి ప్రయాణించాలి. జట్టులో ఐక్యతను తీసుకురావడానికి దీనిని తీసుక రానున్నారు.

* ఏదైనా సిరీస్ జరుగుతున్నా లేదా జట్టు విదేశీ పర్యటనలో ఉన్నా.. ఆ సమయంలో, ఆటగాళ్లకు వ్యక్తిగత ప్రకటన షూట్‌లు చేయడానికి లేదా స్పాన్సర్‌లతో పని చేయడానికి స్వేచ్ఛ ఉండదు.

* భారత జట్టు 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు విదేశీ పర్యటనలో ఉంటే. అటువంటి పరిస్థితిలో, ఆటగాడి కుటుంబం అతనితో 2 వారాలు మాత్రమే ఉండగలదు. విజిటింగ్ పీరియడ్ ఖర్చులను బీసీసీఐ భరిస్తుందని, మిగతా ఖర్చులను ఆటగాళ్లే భరించాల్సి ఉంటుంది.

* షూట్‌లు, బీసీసీఐ నిర్వహించే అన్ని ఇతర కార్యక్రమాలకు ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి. ఇది జట్టు పట్ల ఆటగాళ్ల ఐక్యతను పెంపొందించడంతో పాటు క్రికెట్ ఆటను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.

* నిర్ణీత సమయానికి ముందే మ్యాచ్ ముగిసినా.. మ్యాచ్ లేదా సిరీస్ ముగిసే వరకు ఆటగాళ్లందరూ కలిసి ఉండాలి.