Leading News Portal in Telugu

దావోస్ వేదికగా చంద్రబాబు వర్సెస్ రేవంత్.. పెట్టుబడుల ఆకర్షణ పోటీలో గెలుపెవరిదో? | cbn versus revanth in davoos| telugustates| cms| attract| investors| who| upper


posted on Jan 17, 2025 1:07PM

గురు శిష్యులుగా రాజకీయాలలో గుర్తింపు పొందిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా తమతమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించడానికి పోటీ పడనున్నారు.  స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025కి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. వీరిద్దరు తమ తమ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రులు, అధికారుల బృందంతో బయలుదేరుతున్నారు. ఈ పెట్టుబడుల ఆకర్షణ పోటీలో ఎవరు పై చేయి సాధిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. తమతమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఇరువురికీ సమానంగా సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి.  

చంద్రబాబు నాయుడు ఈ విషయంలోఅపారమైన అనుభవం ఉంది. గతంలో పలు మార్లు చంద్రబాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు హాజరయ్యారు. అభివృద్ధి, దార్శనికతలో చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అమోఘంగా ఉంది. ఈ కారణంానే ఆయన ప్రధాన పెట్టుబడిదారులకు సుపరిచితుడు. ఆయన పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో ఆయన పెట్టుబడిదారులను ఆకర్షించి ఏపీకి పెట్టుబడులను సాధించడం నల్లేరు మీద బండి నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే అదే సమయంలో ఒకింత ప్రతికేలతను కూడా ఆయన ఎదుర్కోనే అవకాశం ఉంది. అదేంటంటే గత ఐదేళ్ల జగన్ పాలన కారణంగా బ్రాండ్ ఏపీ ఇమేజ్ దారుణంగా దెబ్బతింది. మరో సారి జగన్ పాలన రాదన్న గ్యారంటీ ఇవ్వగలరా అన్న ప్రశ్న పెట్టుబడి దారుల నుంచి ఆయనకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు తమను అలా ప్రశ్నిస్తున్నారంటూ మంత్రి లోకేష్ చెప్పారు. 

ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే.. హైదరాబాద్ ఆయనకు ఓ పెద్ద సానుకూలాంశం. ఇక్కడ పెట్టుబడుల కోసం పెద్ద ప్రయత్నించాల్సిన అవసరం లేకుండానే పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు తరలి వస్తారు. అందుకు అవసరమైన పూర్తి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఉంది. ఇక ప్రతి కూలాంశం విషయానికి వస్తే రేవంత్ తొలి సారి ముఖ్యమంత్రి. ఆయన అధికార పగ్గాలు చేపట్టి ఏడాది మాత్రమే అయ్యింది. అలాగే రేవంత్ రెడ్డికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఆసక్తిగానీ, నేర్పు ఉన్న దాఖలాలు ఇంత వరకూ అయితే పెద్దగా కనిపించలేదు.  మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దావోస్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాల్సి ఉంది.