సింగపూర్ ఐటీఈతో తెలంగాణ స్కిల్ వర్సిటీ ఓప్పందం | telangana skill varsity agreement with singapore ite| job| ready
posted on Jan 17, 2025 2:25PM
రైజింగ్ తెలంగాణ అజెండాగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలుత ఆయన సింగపూర్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల సింగపూర్ పర్యటన తరువాత ఆయన దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరౌతారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆక్ష్న సింగపూర్ ఐటీఈతో యువతను ఉద్యోగాలకు సమాయత్తం చేసే లక్ష్యంలో చేపట్టిన స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించే ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు ఐటీఈ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్‌తో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న విభాగాలు, నెట్ వర్క్ ల పనితీరును రేవంత్ బృందం పరిశీలించింది. ఆయా రంగాలలో , విభాగాలలో పనిచేస్తున్న నిపుణులతో మాట్టాడారు.
తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్ ఐటీఈతో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు సింగపూర్ ఐటీఈ టెన్త్ విద్యార్థుల నుంచి ఆసక్తి ఉన్న ఏ వయసు వారికయినా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణ అందిస్తుంది. ఈ ఒప్పందం స్కిల్ యూనివర్సిటీ లక్ష్యాలను అందుకోవడంలో ఎంతో దోహదపడుతుందని రేవంత్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించనుంది.