Leading News Portal in Telugu

సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్టు | suspect arrested for attacking actor saif Ali ahan| mumbay| police| questioning| bandra| policestation| 10teams| search


posted on Jan 17, 2025 10:40AM

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసి గాయపరిచిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని ముంబైలోని బాంద్రా పోలీసు స్టేషన్ లో విచారిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి కోసం పది బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా గాలించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. గురువారం తెల్లవారు జామున సైఫ్ అలీఖాన్ నివాసంలోనే అతడిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.  

గురువారం (జనవరి 16) తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను దాటుకుని నిందితుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి ఎలా చోరబడ్డాడన్న అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి.