- అవమానకర రీతిలో తన సోదరితో కలిసి బంగ్లాదేశ్ వదిలి వచ్చా..
- నన్ను చంపేందుకు అనేక సార్లు కుట్రలు చేశారని ఆరోపించిన హసీనా..
- అల్లాయే దయతో నేను బ్రతికి ఉన్నాను: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా సంచలన కామెంట్స్ చేసింది. ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి భారత్కు వచ్చే ముందు తనని, తన చెల్లెలు షేక్ రెహానాను హత్య చేసేందుకు అనేక కుట్రలు చేశారని తెలిపారు. గతేడాది ఆగస్టు నెలలో ఉద్యోగ రిజర్వేషన్ల చిచ్చుతో చెలరేగిన అల్లర్లలో బంగ్లాదేశ్ ప్రభుత్వం పడిపోయింది. ప్రధానికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అవమానకర రీతిలో తన సోదరితో కలిసి దేశాన్ని విడిచి పెట్టిన ఘటనను తాజాగా షేక్ హసీనా గుర్తు చేసుకుంది.
అయితే, బంగ్లాదేశ్ లోని అవామీ లీగ్ పార్టీ ఫేస్బుక్ పేజీలో మాజీ ప్రధాని షేక్ హసీనా ఆడియో ప్రసంగాన్ని పోస్ట్ చేసింది. ఆ ఆడియోలో రెహానా, నేను కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే చనిపోయే వాళ్లం.. తనను చంపేందుకు అనేక సార్లు కుట్రలు చేశారని ఆమె గుర్తు చేసుకున్నారు. 2004న ఆగస్టు 21న జరిగిన హత్యల నుంచి కోటాలిపారాలో జరిగిన భారీ బాంబు దాడి నుంచి బయటపడటమే నిదర్శనమని హసీనా వెల్లడించారు. ఆ అల్లాయే లేకపోతే నేను ఇలా మీ ముందు మాట్లాడే దాన్ని కాదన్నారు. కుట్రదారులు నన్ను ఎలా చంపాలని ప్లాన్ చేశారో మీరందరూ చూశారు. కానీ, నేను నా దేశం నుంచి కట్టుబట్టలతో రావడంపై చాలా బాధగా ఉందని షేక్ హసీనా కన్నీరు పెట్టుకుంది.