Leading News Portal in Telugu

Robinhood to Release on March 28 so Harihara Veeramallu may not release on that day


Harihara Veeramallu : ఆరోజు హరిహర వీరమల్లు డౌటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ డై హార్డ్ ఫ్యాన్స్ లిస్ట్ తీస్తే.. యంగ్‌ హీరో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. దాదాపుగా తన ప్రతీ సినిమాలోను పవర్ స్టార్ రెఫరెన్స్ ఉంటుంది. అలాంటిది.. నితిన్ ఏకంగా పవర్ స్టార్ సినిమాకు పోటీగా తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం విశేషం. వెంకీ కుడుముల దర్శకత్వంలో.. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. వాస్తవానికైతే.. 2024 డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్‌గా.. మార్చి 28న రాబిన్ హుడ్ రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ లాక్ చేశారు మేకర్స్. కానీ అదే రోజు పవర్ స్టార్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోను రిలీజ్ చేసి తీరుతామని నిర్మాతలు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే వీరమల్లు షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది.

Mohan Babu: మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. ఇంటి నుంచి మనోజ్ ను బయటకు పంపాలని ఫిర్యాదు!

రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. సినిమా పై మంచి హైప్ తీసుకొచ్చింది. మాట వినాలి అంటూ స్వయంగా పవన్ పాడిన ఈ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ వీరమల్లు కోసం వెయిటింగ్ అని అంటున్నారు. కానీ ఇప్పుడు అదే రోజు నితిన్ సినిమా రానుందని ప్రకటించడంతో.. వీరమల్లు మళ్లీ పోస్ట్ పోన్ అవనుందా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే.. వీరమల్లు పై ఉన్న ఆ కొద్ది ఆసక్తి కూడా తగ్గిపోవడం గ్యారెంటీ. అసలే ఏండ్లకేండ్లు ఈ సినిమా నానుతూ వస్తోంది. మధ్యలో దర్శకుడు క్రిష్ తప్పుకోవడంతో.. నిర్మాత ఏ.ఏం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. మరి ఈసారైనా అనుకున్న సమయానికి హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందో? లేదో? చూడాలి.