Leading News Portal in Telugu

ఎల్లూరులో కాకతీయ కాలపు అరుదైన వీరగల్లు శిల్పం | kakateya times rare veeragallu sclupture| pleach| india| ceo| emani| say


posted on Jan 18, 2025 6:55PM

కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి

నాగర్ కర్నూలు జిల్లాలో మండల కేంద్రమైన కొల్లాపూర్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లూరులో కాకతీయుల కాలపు అరుదైన వీరగల్లును గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు,ప్లిచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో శివ నాగిరెడ్డి, వెన్నెల సాహిత్య అకాడమీ ముచ్చర్ల దినకర్, చరిత్ర పరిశోధకుడు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు డాక్టర్ భైరోజు శ్యామసుందర్ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోని బాపూజీ భవన్ లో ఉన్న నల్ల శానపు రాతిపై నలువైపులా శిల్పాలతో చెక్కిన వీరగల్లును శనివారం (జనవరి 18) వారు సందర్శించారు. ఒక వైపు చెన్నకేశవుడు, రెండవ వైపు మూడవ వైపు యుద్ద దృశ్యాలు, నాలుగోవైపు ఒక స్త్రీ ఆత్మహసి దృశ్యంతో కాకతీయ కాలపు మన విధానానికి అద్దం  పడుతున్న శిల్పం అత్యంత అరుదైనదని శివనాగిరెడ్డి తెలిపారు.  చారిత్రక ప్రాధాన్యత గల ఈ వీరగల్లును ఎత్తయిన పీఠంపై నిలబెట్టి చారిత్రక వివరాల బోర్డును ఏర్పాటు చేసి కాపాడుకోవాలని గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్థానికుడు సొరగొని కృష్ణయ్య గౌడ్ ఇంకా బర్త్డే సాయి కిరణ్, అద్దంకి రవీంద్ర రవీంద్ర పాల్గొన్నారని ఆయన చెప్పారు.