Leading News Portal in Telugu

Trump Spoke To Advisers About Possible Trip To India: Report


  • భారత పర్యటనపై ట్రంప్ ఆసక్తి..
  • సలహాదారులతో చర్చించిన ట్రంప్..
  • మోడీని వైట్‌హౌజ్‌కి ఆహ్వానించే అవకాశం..
Trump Trip To India: భారత పర్యటనపై ట్రంప్ ఆసక్తి.. సలహాదారులతో చర్చ..

Trump Trip To India: సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది విదేశీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, టెక్ దిగ్గజాలు హాజరుకాబోతున్నారు. మరోవైపు ట్రంప్ తన తొలిరోజు ఎలాంటి సంచలన ఆర్డర్స్‌పై సంతకాలు చేస్తారనే దానిపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఇదిలా ఉంటే, ట్రంప్ భారతదేశ పర్యటనపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత చైనాకు వెళ్లాలనుకుంటున్నారు. బీజింగ్‌తో వాషింగ్టన్ సంబంధాలను పెంచుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు ప్రారంభించారు. అయతే, భారతదేశ పర్యటన గురించి సలహాదారులతో మాట్లాడినట్లు మీడియా నివేదికలు శనివారం తెలిపాయి. “అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనాకు వెళ్లాలనుకుంటున్నట్లు సలహాదారులకు చెప్పారని, విషయం తెలిసిన వ్యక్తుల ప్రకారం, చైనా దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తానని ట్రంప్ బెదిరింపుతో, చైనాతో దెబ్బతిన్న సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు” అని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

‘‘ట్రంప్ ఇండియా వెళ్లే అవకాశం గురించి కూడా సలహాదారులతో మాట్లాడారని తెలిసింది’’ నివేదించింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత నెల క్రిస్మస్‌ సమయంలో వాషింగ్టన్ వెళ్లిన సమయంలోనే ప్రాథమిక చర్చలు ప్రారంభమయ్యాయని తెలిసింది. ఆస్ట్రేలియా, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ నాయకులతో కూడిన క్వాడ్ సమ్మిట్‌ను భారతదేశం నిర్వహించనుంది. ఈ పర్యటన ఏప్రిల్ ప్రారంభంలో లేదా ఈ సంవత్సరం చివర్లో జరగవచ్చు. దీనికి ముందే, ప్రధాని నరేంద్రమోడీని డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌజ్‌కి ఆహ్వానించే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.