Leading News Portal in Telugu

Senior Actor Naresh Raises Concerns Over Padma Awards, Criticizes Lack of Recognition for Industry Veterans


Naresh : ఢిల్లీ స్థాయిలో ప్రయత్నించా.. మా అమ్మకు అవార్డు రాలేదు : నరేష్

Naresh : సీనియర్ నటుడు నరేష్ ఇటీవల పద్మ అవార్డుల ప్రదానం ప్రక్రియ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాపై తన నిరసనను వ్యక్తం చేస్తూ, ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేష్ మాట్లాడుతూ, “పద్మ అవార్డులు అందుకోవడం భారతదేశంలో అత్యున్నత గౌరవంగా భావిస్తాం. కానీ ఇవి నిజంగా అర్హులైన వారికి అందుతున్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా సేవలందిస్తున్నవారిని గుర్తించడంలో కొంతపాటి లోపం కనిపిస్తోంది. పద్మ అవార్డుల బరిలో రాజకీయాల ప్రభావం తగ్గి, ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలి” అని పేర్కొన్నారు.

తన తల్లి విజయ నిర్మలకు అవార్డు ఇవ్వకపోవడం పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నరేష్ మాట్లాడుతూ.. ‘‘46 మూవీస్ ను డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయనిర్మల గారు. నేను ఢిల్లీ స్థాయిలో అమ్మకు పద్మ అవార్డ్ కోసం ప్రయత్నించాను . కానీ అమ్మకు పద్మ అవార్డు రాలేదు. ఆవిడ పద్మ అవార్డ్ కోసం కెసిఆర్ గారు కూడా రికమెండ్ చేశారు. నేను ఏ గవర్నమెంట్ ను విమర్శించడం లేదు. బీజేపీ వచ్చిన తరువాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు ఇస్తున్నారు సంతోషం గా ఉంది. ఎంజీఆర్ గారు బ్రతికున్నప్పుసు పద్మ అవార్డు రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాలేదు. తెలుగు ఇండస్ట్రీ వృద్ధికి కృషి చేసిన మా అమ్మగారికి ఇవ్వాలి. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఆ అర్హత కలిగిన వాళ్లు ఉన్నారు. మన వాళ్లకు పద్మ అవార్డు లు వచ్చేందుకు ఆమరణ నిరాహారదీక్ష చేసిన తప్పులేదు. మళ్లీ ఇప్పటి నుంచి అమ్మకు పద్మ అవార్డు రావడం కోసం ప్రయత్నిస్తాను.’’ అంటూ చెప్పుకొచ్చారు.