Leading News Portal in Telugu

ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు | tirumala vaikuntha dwara darshanams closed| 10days| ttd| tokens


posted on Jan 20, 2025 10:19AM

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. చివరి రోజైన ఆదివారం (జనవరి 19) శ్రీవారిని మొత్తం 70 వేల 826 మంది వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకున్నారు. వారిలో 22 వేల 625 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 68 లక్షలు వచ్చింది. కాగా వైకుంఠ ఏకాదశితో ఆరంభించి పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అవకాశం కల్పించింది. ఆదివారం (జనవరి 19) అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు అర్చకులు వైకుంఠ ద్వారాలను  

ఈ పది రోజుల వ్యవధిలో 6 లక్షల 83 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ 6  భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భారీగా హుండీ కానుకలు వచ్చాయి.