Leading News Portal in Telugu

Naga Chaitanya Teams Up with Karthik Varma Dandu.. “Vrushakarma” Title Under Consideration


Naga Chaitanya : నాగచైతన్య తర్వాత సినిమా కోసం బాలీవుడ్ విలన్..?

Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే నెలలో పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందే నాగ చైతన్య తన తదుపరి సినిమాను లైన్ లో పెట్టుకున్నట్లు తెలిసింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగ చైతన్య చేయబోయే తదుపరి సినిమాకు మేకర్స్ క్రేజీ టైటిల్ ను ఆలోచిస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి.

నాగ చైతన్య తన తదుపరి సినిమాను ‘విరూపాక్ష’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ విషయంలో ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ తో షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాయి. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించబోతున్నారు. ఈ చిత్రాన్ని 2025 చివరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ఇంకా ఖరారు చేయలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్‌ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, కార్తీక్ చివరి చిత్రం ‘విరూపాక్ష’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రారంభించారు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్‌గా ఓ బాలీవుడ్ నటుడు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉండనుందని.. అందుకోసం బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాత్సవ ఈ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోతాడని కార్తీక్ దండు భావిస్తున్నాడట. దీని కోసం ఆయన్ను సంప్రదించడం కూడా జరిగినట్లుగా తెలుస్తోంది.