అలిపిరి దాడి సూత్రధారి.. మావోయిస్టు అగ్రనేత చలపతి హతం | moast leader chalapathi killed in encounter| alipiri| attack| cbn
posted on Jan 22, 2025 7:32AM
మావోయిస్టులను భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ ఒడిశా సరిహద్దుల్లో సోమవారం నుంచి మంగళవారం వరకూ రెండు రోజుల పాటు జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో పాతిక మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత రామచంద్రారెడ్డిగారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి మరణించారు. చలపతి అనగానే ఎవరికైనా ఠక్కున 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై అలిపిరిలో జరిగిన క్లెమోర్ మైన్ దాడి గుర్తుకు వస్తుంది. ఆ దాడి సూత్రధాని, కీలక పాత్రధారి ఈ చలపతే. అప్పటి నుంచీ అజ్ణాతంలో ఉన్న చలపతి తలపై కోటి రూపాయల రివార్డ్ ఉంది. అప్పటి నుంచీ ఎక్కడా కనిపించని చలపతి ఇప్పుడు ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యారు.
ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర కార్యదర్శి రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతిలో పాటు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోడం బాలకృష్ణ, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డూ కూడా ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.