Leading News Portal in Telugu

We Need Great people to come to US: Donald Trump weighs in on H-1B visa debate


  • హెచ్1బీ వీసాల విస్తరణపై రిపబ్లికన్‌ పార్టీలో భిన్నాభిప్రాయాలు..
  • చట్టబద్ధమైన వలసలకు మద్దుతుగా నిలిచిన మస్క్, రామస్వామి..
  • అమెరికా ఫస్ట్ అనే విధానానికి కట్టుబడి ఉన్నామంటున్న నిక్కీ హెలీ..
  • సమర్థవంతమైన ప్రజలే అమెరికాకు రావాలి.. హెచ్1బీ వీసాలతోనే సాధ్యం: డొనాల్డ్ ట్రంప్
Donald Trump: సమర్థవంతమైన ప్రజలే అమెరికాకు రావాలి..

Donald Trump: హెచ్1బీ వీసాల విస్తరణపై డొనాల్డ్‌ ట్రంప్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి చట్టబద్ధమైన వలసలకు సపోర్ట్ ఇస్తుంటే, ఇతర నేతలు మాత్రం యూఎస్ ఫస్ట్ అనే విధానానికి కట్టుబడి ఉన్నారు. దీనిపై అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. తనకు రెండు వైపుల వాదనలూ నచ్చాయి.. సమర్థవంతమైన ప్రజలు అమెరికాలోకి రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే కాదు.. అన్ని స్థాయిల వ్యక్తుల గురించి ఈ మాట చెబుతున్నాను అన్నారు. దేశ వ్యాపారాలను విస్తరించడానికి మాకు సమర్థవంతమైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలని తెలిపారు. అది హెచ్‌1బీ వీసాతోనే సాధ్యమవుతుందని నమ్ముతున్నాను అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

ఇక, ఆర్హత కలిగిన సాంకేతిక నిపుణులు యూఎస్ కు వచ్చేందుకు హెచ్‌1బీ వీసా ఎంగానో ఉపయోగపడుతోందని ఎలాన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వామి చెప్పుకొచ్చారు. కానీ, దీనిపై రిపబ్లికన్‌ పార్టీకి చెందిన నిక్కీ హేలీ మరో వాదనను తెరపైకి తీసుకొచ్చారు. తాను దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఉన్నప్పుడు నిరుద్యోగిత రేటు 11 నుంచి 4 శాతానికి తీసుకొచ్చాం.. విదేశీ ఉద్యోగులను కాకుండా కేవలం పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించామన్నారు. అయితే, కొత్త ఉద్యోగాల కోసం ప్రజలకు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల వారు విమానాలు, ఆటోమొబైల్స్‌ తయారీలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చింది. సాంకేతిక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని భావిస్తే ముందు విద్యారంగంపై దృష్టి పెట్టాలని వెల్లడించారు. అంతేకానీ అమెరికన్లను తక్కువ అంచనా వేయొద్దని నిక్కీ హెలీ స్పష్టం చేసింది.