హన్మకొండలో వ్యక్తి హత్య..వివాహేతర సంబంధమే కారణం | The reason for the murder of a person in Hanmakonda..is an extra-marital affair
posted on Jan 22, 2025 12:47PM
హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఇద్దరు కూడా ఆటో డ్రైవర్లుగా ఉన్నారు. మణికొండకు చెందిన ఆటో డ్రైవర్లు రాజ్ కుమార్, ఏనుగు వెంకటేశ్వర్లు తమ గ్రామానికి చెందిన యువతితో ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. హన్మకొండ చౌరస్తా వద్ద ఇద్దరూ ఎదురు పడ్డారు. మాటామాటా పెరగడంతో ఏనుగు వెంకటేశ్వర్లు తన వెంట తెచ్చుకున్న కత్తితో రాజ్ కుమార్ ను పొడిచి చంపేశాడు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీ మార్ట్ ఎదురుగా ఈ ఘటన జరిగింది.