posted on Jan 22, 2025 4:17PM
నల్లగొండ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మహా ధర్నా చేపట్టడానికి కోర్టు పచ్చ జెండా ఊపింది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తో బాటు పలువురు ముఖ్య నాయకులు ఈ మహాధర్నాలో పాల్గొననున్నారు. రైతు మహాధర్నాకు రేవంత్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ హైకోర్టునాశ్రయించింది. ఆఖరినిమిషంలో అనుమతి ఇవ్వలేమని జిల్లా ఎస్పీ తేల్చి చెప్పడంతో బిఆర్ఎస్ కోర్టు తలుపులు తట్టింది. పద్నాలుగు నెలల కాంగ్రెస్ హాయంలో ప్రజా సమస్యల పరిష్కారం కాకపోవడంతో బిఆర్ ఎస్ పోరు బాట పట్టింది.