israeli minister says pm modi first world leader to call netanyahu after oct 7 hamas attack will never forget
- అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రపంచ నేత ఫోన్ చేసి సంఘీభావం
- ఆ ప్రపంచ నేతకు కృతజ్ఞతలు తెలిపిన ఇజ్రాయెల్ మంత్రి

అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తర్వాత మొట్టమొదట ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసింది.. భారత్ ప్రధాని మోడీనే అని ఇజ్రాయెల్ మంత్రి నిర్ బర్కత్ తెలిపారు. ఈ విషయం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. ఈ మేరకు మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. కష్టకాలంలో ఇజ్రాయెల్‌కు మోడీ మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Off The Record: నెగిటివ్ సెంటిమెంట్‌గా విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి..!
స్విట్జర్లాండ్‌లో దావోస్ సమ్మిట్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో బర్కత్ మాట్లాడారు. హమాస్ దాడి చేసిన తర్వాత నెతన్యాహుకు ప్రధాని మోడీ ఫోన్ చేసి మద్దతు తెలిపారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఎప్పటికీ మరిచిపోదని తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. మోడీ-నెతన్యాహు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. వారి మధ్య ఉన్న స్నేహాన్ని బర్కత్ ప్రశంసించారు. ఇజ్రాయెలీయులను హమాస్ బందీలుగా తీసుకెళ్లిన తర్వాత మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని గుర్తుచేశారు. హమాస్ దాడులతో దిగ్భ్రాంతికి గురయ్యామని.. మా ప్రార్థనలు బాధిత కుటుంబాలకు తోడుగా ఉంటాయని.. కష్టకాలంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు మోడీ చెప్పారని బర్కత్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Bashar al Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి ఇక్కట్లు.. ఫ్రాన్స్ అరెస్ట్ వారెంట్ జారీ