Leading News Portal in Telugu

Writing a diary move on Samantha says it will gradually become a habit


Samantha: ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా ఉన్న.. తర్వాత అదే అలవాటయిపోద్ది : సమంత

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. మూవీస్ విషయం పక్కన పెడితే ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది సామ్. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటు ప్రతి ఒక విషయాని తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఇన్ స్టా లో ఓ పోస్ట్ పెట్టింది.

డైరీ రాయడం పాత పద్ధతైన, తర్వాత చదువుకోవడానికి బాగుంటుంది. ఈ రోజు మనం ఎవరికి గ్రేట్ ఫుల్‌గా ఉన్నాం..? ఈ రోజు మనం ఇలా ఉన్నందుకు ఎవరికి థాంక్స్ చెప్పుకోవాలి? ఇలా కొన్ని కారణాలు మీరు డైరీలో రాసుకోండి అంటూ సమంత సలహా ఇచ్చింది.. ‘ నేను గత రెండు సంవత్సరాలుగా డైరీ రాస్తున్నాను. నా కష్టమైన, కష్టం అయిన క్షణాలు కొన్నింటిని ఇందులో పొందుపరిచాను. ఎక్కడ ఉన్నాను,ఎక్కడికి వెళ్తున్నారు, మున్ముందు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది ఏం రాయాలో కూడా అర్థం కాదు. కానీ ఎంత చిన్న విషయమైనా సరే అందులో రాసుకోండి, మెల్లిగా అదొక అలవాటుగా మారుతుంది. మనలో చాలా మార్పులు వస్తాయి. గత రెండేళ్ల నుంచి దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నా,నాకు ఇదొక గేమ్ ఛేంజర్‌లా మారింది. అందరూ దీన్ని ట్రై చేయండి.. ఎవరి లైఫ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం’ అని సమంత పోస్ట్ చేసింది. దీంతో సామ్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు.