Leading News Portal in Telugu

India win over Sri Lanka in ICC Women U19.


  • మహిళల అండర్-19 టీ 20 వరల్డ్ కప్
  • 60 పరుగుల తేడాతో శ్రీలంకపై భారత్ విక్టరీ
  • భారత్ 118/9, శ్రీలంక 58/9.
ICC Women U-19: శ్రీలంకపై భారత్ విక్టరీ.. సూపర్ సిక్స్‌లోకి ఎంట్రీ

ఐసీసీ అండర్ 19 టీ20 (ICC U19 T20) మహిళల ప్రపంచ కప్‌లో భారత్ సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 60 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. తక్కువ పరుగులు చేసిన భారత్.. బౌలర్ల విజృంభణతో శ్రీలంకను కేవలం 58 పరుగులకే ఆలౌట్ చేశారు. శ్రీలంక బ్యాటింగ్‌లో రష్మిక సెవ్వండి మాత్రమే రెండంకల స్కోరు దాటింది. 12 బంతుల్లో 15 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లతా విఫలమయ్యారు. భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్.. 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్‌లో ఓపెనర్ గొంగడి త్రిష (49) పరుగులతో రాణించింది. భారత్ బ్యాటర్లలో మిగతా బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. కానీ.. భారత్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను 58 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో భారత్ సూపర్ సిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.