Leading News Portal in Telugu

Americans will pay more if Trump imposes tariffs on Canada: Justin Trudeau


  • కెనడా ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడి..
  • అదనపు సుంకాలు విధిస్తే.. అమెరిక వినియోగదారులే భారీ మూల్యం చెల్లించుకోవాలి..
  • కెనడాతో వాణిజ్య భాగస్వామ్యాన్ని అమెరికా మరింత బలోపేతం చేసుకోవాలి: జస్టిన్ ట్రూడో
Justin Trudeau: మా దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తే.. ఎక్కువ కట్టేది అమెరికన్ ప్రజలే!

Justin Trudeau: తమ దేశ ఉత్పత్తులపై అధిక టారిఫ్ లు విధిస్తే అమెరికాలోని వినియోగదారులే అధిక మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కెనడా, మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై 25 శాతం అదనపు టారీఫ్‌లు విధించబోతున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ట్రూడో మరోసారి దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఇక, ట్రంప్‌ తన నిర్ణయంపై ఎప్పుడు ముందుకెళ్లినా దానికి తగినట్లు స్పందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. ఆయన నిర్ణయం అమలు చేస్తే యూఎస్ వినియోగదారులే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అన్నారు. ఈ చర్యలను తాము కోరుకోవడం లేదు.. ట్రంపే కావాలని అనుకుంటున్నారని వెల్లడించారు. ఆర్థిక వృద్ధిని పెంచుతానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మాతో వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చెప్పారు. కానీ, అమెరికా అధ్యక్షుడు అందుకు విరుద్ధంగా వెళ్తున్నారని ట్రూడో ఆరోపించారు.

అయితే, యూఎస్ లోని 36 రాష్ట్రాలకు అత్యధికంగా ఎగుమతులను కెనడా చేస్తుంది. ప్రతి రోజు 3.6 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులు అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. అగ్రరాజ్యంలో ఒక రోజు వినియోగించే చమురులో దాదాపు 4వ వంతు కెనడా దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక, యూఎస్ నుంచి స్టీలు, గాజు ఉత్పత్తులతో పాటు ఫ్లోరిడా ఆరెంజ్‌ జ్యూస్‌ను కెనడా ఇంపోర్ట్ చేసుకుంటుంది.