posted on Jan 24, 2025 3:59PM
భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నవారు తమ వద్ద డబ్బులు లేకున్నా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి చెల్లించకుండానే టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. https://www.epaylater.in/ అనే వెబ్సైట్ ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, టికెట్ బుక్ చేసుకున్న 14 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలి. చెల్లించకపోతే మాత్రం 3.5% సర్వీస్ చార్జ్ కట్టాల్సి ఉంటుంది.