Leading News Portal in Telugu

అలకనంద కిడ్నీ రాకెట్ కేసు సిఐడికి ? 


posted on Jan 24, 2025 12:44PM

అలకనంద కిడ్నీ రాకెట్ కేసును సిఐడికిఅప్పగించే యోచనలో తెలంగాణ సర్కారు ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ లో పెద్ద తలకాయలు ఉన్నట్లు తెలుస్తోంది. సరూర్ నగర్ లో ఉన్న ఈ ఆస్పత్రిలో గత కొన్ని నెలలుగా కిడ్నీ రాకెట్  గుట్టు చప్పుడు కాకుండా నడుస్తోంది. . అలకనంద హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సుమంత్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.  ప్రకాశం జిల్లాకు చెందిన డాక్టర్ అలకనంద ఆస్పత్రిలో భాగస్వామి అని పోలీసుల దర్యాప్తులో తేలింది.    మొత్తం ఆరుగురు ఈ కిడ్నీ రాకెట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిని ఇప్పటికే సీజ్ చేశారు. ఒక్కో కిడ్నీ ఆపరేషన్ కోసం అలకనంద 50 నుంచి 55 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది.  కేవలం ఆరు నెలల క్రితం ప్రారంభమైన ఈ హాస్పిటల్ కిడ్నీ రాకెట్ నడిపించిదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. కిడ్నీ రాకెట్ నిర్వహించడానికే ఈ ఆస్పత్రి ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. తొమ్మిది పడకలతో ఏర్పాటైన ఈ ఆస్పత్రికి ఇద్దరు తమిళనాడుకు చెందిన గ్రహీతలు, ఇద్దరు కర్నాటక వాసులు డోనర్స్ ను అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  వీరిని ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ఉస్మానియా మాజీ సూపరిండెంట్ డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని నియమించింది. కేసు దర్యాప్తులో  డాక్టర్ నాగేందర్ కమిటీ ఇచ్చే నివేదిక దర్యాప్తులో కీలకం కానుంది.