Leading News Portal in Telugu

AI-Generated Photos of Team India Players at Maha Kumbh Mela 2025 Going Viral


  • మహా కుంభమేళాలో టీమిండియా ఆటగాళ్లు.
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఏఐ ఫొటోస్.
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాలో టీమిండియా ఆటగాళ్లు.. వైరల్ అవుతున్న ఏఐ ఫొటోస్

Maha Kumbh Mela 2025: ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోల్‌కతాలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించగా.. నేడు చెన్నై వేదికగా రెండో టి20 మ్యాచ్ జరుగునుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో టీమిండియాకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

వైరల్ గా మారిన ఫోటోలను చూస్తే.. టీమిండియా ఆటగాళ్లు కాషాయపు వస్త్రాలు ధరించి కుంభమేళాలో పాల్గొన్నట్టుగా కనబడుతోంది. ఈ ఫోటోలలో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత టీమ్ ఇండియా కెప్టెన్స్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ లతోపాటు మిగతా టీం ఇండియా ఆటగాళ్లకు సంబంధించిన ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలను గమనించినట్లయితే ప్రస్తుతం ఏఐ వాడుక ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఇక ఈ ఫోటోలను చూసిన టీమిండియా అభిమానులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇక ఈ ఫోటోలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. భారత క్రికెట్ ఆటగాళ్లు నిజంగానే కుంభమేళకు వెళితే ఇలాగే ఉంటారేమో అని సికొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరేమో.. ఈ వేషధారణలో ఆటగాళ్లు భలే ఉన్నారంటూ వివిధరకాల ఎమోజిలతో కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలశ్యం మీరు కూడా ఫొటోస్ చూసి మీకేమనిపించిందో ఒక కామెంట్ చేయండి.