- సుకృతి వేణి ప్రధాన పాత్రలో గాంధీ తాత చెట్టు
- పద్మావతి మల్లాది దర్శకత్వం
- అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రం
- రామ్ చరణ్, ఉపాసన అభినందన
- తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన

Gandhi Tatha Chettu : ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు కాగా పద్మావతి మల్లాది దర్శకురాలుగా వ్యవహరించారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా అనేక పురస్కారాలు పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాను తెలుగులోనూ మంచి బజ్‌తో రిలీజ్ అయింది. ఈ చిత్రాన్ని పూర్తి ఫీల్ గుడ్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారమే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి మేకర్స్ ఆనందంగా ఉన్నారు. ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వంటి వారు ఇప్పటికే తమ విషెస్ చెబుతూ అంచనాలను అమాంతం పెంచేశారు. తాజాగా ఈ చిత్ర యూనిట్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కొణిదెల అభినందించారు. ‘గాంధీ తాత చెట్టు’ వంటి మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాన్ని నేటి సమాజానికి అందించినందుకు చిత్ర యూనిట్‌కు వారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న ఈ సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ అందుకోవడం సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సందర్భంగా సుకృతి వేణి, చిత్ర దర్శకురాలు, నిర్మాతలతో పాటు తబిత సుకుమార్ కూడా మెగా కపుల్‌ని కలిశారు.