Leading News Portal in Telugu

Ram Charan and Buchibabu in the movie.. Bollywood hero Ranbir Kapoor?


RC16 : రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో.. బాలీవుడ్ హీరో?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ఫ్యాన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించిన..అందుకోవాల్సిన టార్గెట్‌ని మాత్రం అందుకోలేక పొయింది. దాదాపు ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వచ్చిన రామ్ చరణ్‌కు పెద్ద నిరాశ ఎదురయ్యింది.. దీంతో తన తదుపరి సినిమా ‘ఆర్ సి 16’ పై గట్టిగా ఫోకస్ చేస్తున్నారు చరణ్.

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘ఆర్ సి 16’. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోండగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ఒక చిన్న క్యారెక్టర్‌ని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో దాదాపు ఒక ఐదు నిమిషాల పాటు ఉండే విధంగా ప్లాన్ చేశారట. అంతేకాదు రణబీర్ కపూర్‌ని కూడా అడిగి అతనికి కథ చెప్పి అతన్ని ఒప్పించినట్టుగా టాక్ అయితే వినపడుతుంది.

ఇక ఇటివల ‘యనిమల్’ సినిమాతో తెలుగులో కూడా రన్‌బీర్ కి మంచి మార్కెట్ ఏర్పడింది. కాబట్టి ఈ వార్త నిజమే అయితే కనుక ‘ఆర్ సి 16’ సినిమా మీద అటు బాలీవుడ్ లోనూ, ఇటు తెలుగులోనూ మంచి మార్కెట్ అయితే క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఇండియన్ ప్రేక్షకులకు నచ్చాలంటే, ఇందులో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, మంచి కథ కూడా ఉండాల్సిందే. మరి బుచ్చిబాబు దాని ఎంత వరకు నిలుపుకుంటాడో చూడాలి.