- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.
- అహ్మదాబాద్‌లో ‘కోల్డ్ ప్లే’ కన్సర్ట్‌కు హాజరైన జస్ప్రీత్ బుమ్రా.
- బుమ్రాపై ప్రత్యేక పాట పాడిన ‘కోల్డ్ ప్లే’ లీడ్ సింగర్ క్రిస్ మార్టిన్.

Coldplay Concert: అహ్మదాబాద్ (Ahmedabad)లో జరిగిన ప్రఖ్యాత సంగీత బృందం ‘కోల్డ్ ప్లే’ కన్సర్ట్‌లో (Coldplay Concert) టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ ఈవెంట్‌కు హాజరైన అభిమానులు బుమ్రాను చూసి పెద్దెతున్న అహకారాలు చేసారు. ఇక కన్సర్ట్ జరుగుతున్న సమయంలో బుమ్రాపై ‘కోల్డ్ ప్లే’ లీడ్ సింగర్ క్రిస్ మార్టిన్ ప్రత్యేకంగా స్పందించి, ఒక ప్రత్యేక పాట పాడి అందరి దృష్టిని ఆకర్షించారు.
“జస్ప్రీత్.. మై బ్యూటీఫుల్ బ్రదర్. ది బెస్ట్ బౌలర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ క్రికెట్. వీ డూ నాట్ ఎంజాయ్ యూ డెస్ట్రాయింగ్ ఇంగ్లండ్ విత్ వికెట్స్ ఆఫ్టర్ వికెట్స్” అంటూ క్రిస్ మార్టిన్ ఆలపించగా, బుమ్రా ఆ పాటను ఎంతో ఆస్వాదించాడు. ఈ సందర్భం కన్‌సర్ట్‌కు ఓ ప్రత్యేకతను జోడించింది. ఈ కార్యక్రమంలో, బుమ్రా ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌లో చూపిన అద్భుత ప్రదర్శన తాలూకు వీడియోను ప్రదర్శించారు. బుమ్రా వికెట్లు తీస్తున్న వీడియోలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవడంతో ప్రేక్షకులు హర్షధ్వానాలతో హోరెతించారు. ఈ వీడియోతో కన్సర్ట్ ఒక కొత్త ఊపును తెచ్చుకుంది.
The ‘game changer’ player is in the house 🔥 turning everything yellow 💛#ColdplayOnHotstar pic.twitter.com/pcXVT3l8L8
— Disney+ Hotstar (@DisneyPlusHS) January 26, 2025
‘కోల్డ్ ప్లే’ కన్సర్ట్‌లో జస్ప్రీత్ బుమ్రా సందడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు బుమ్రా క్రికెట్ ప్రతిభకు, క్రిస్ మార్టిన్ చూపిన ఆత్మీయతకు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బుమ్రా క్రికెట్ కెరీర్‌లో మాత్రమే కాదు, సంగీత ఈవెంట్‌లలో కూడా తాను ఎంత ప్రత్యేకమో మరోసారి నిరూపించాడు.