సుప్రీం లో జగన్ కు భారీ ఊరట | big relief to jagan in supreme| raghurama| krishnmaraju| withdraw| bail| cancil| petition| court| dismiss| another
posted on Jan 27, 2025 11:13AM
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న పిటిషన్ ను తోసి పుచ్చింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పిటిషనరే స్వయంగా దానిని ఉపసంహరించుకున్నారు. సోమవారం సుప్రీం కోర్టులో జరిగిన ఈ ఉదంతంలో జగన్ కు భారీ ఊరట లభించినట్లైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసా పురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన రఘురామకృష్ణరాజు.. ఆ తర్వాత వైసీపీతో, జగన్ తో విభేదించారు. ఆ క్రమంలో ఆయన రెబల్ ఎంపీగా మారి జగన్ కు కొరకరాని కొయ్యిలా తయారయ్యారు.
ఈ క్రమంలోనే రఘురామ కృష్ణం రాజు జగన్ అరాచకపాలనను అడుగడుగునా ఎండ గడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఐడీ జగన్ ను అరెస్టు చేసి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసింది. ఆ తరువాత నుంచి మరింత రెబల్ గా మారారు. ఆ క్రమంలోనే జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సిబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టులను ఆశ్రయించారు. రెండు చోట్లా రఘురామ పిటిషన్లకు కోర్టులు తోసి పుచ్చాయి. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. …జగన్ బెయిల్ ను రద్దు చేయడంతో పాటుగా ఆయన కేసుల విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరుతూ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ఆయన పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు విచారించిన కోర్టు తాజాగా సోమవారం (జనవరి 27) జగన్ కేసులను వేరే రాష్ట్రానికి బదలీ చేయాలన్న పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇక జగన్ బెయిలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రఘురామ తరఫు న్యాయవాది ఉపసంహరించుకున్నారు.