Leading News Portal in Telugu

Afghanistan Azmatullah Omarzai Makes History as ICC ODI Cricketer of the Year


  • క్రికెట్‌ చరిత్రలో సంచలనం.
  • మొదటిసారిగా ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్.
  • 2024 ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ గా అజ్ముతుల్లా ఒమర్జాయ్.
Azmatullah Omarzai: సంచలనం.. ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్

Azmatullah Omarzai: ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెట్‌ చరిత్రలో సంచనాలను సృష్టించిన అజ్ముతుల్లా ఒమర్జాయ్  ‘ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌‘ (ICC ODI Cricketer of the Year)గా ఎంపికైన తొలి ఆఫ్ఘన్ ఆటగాడిగా నిలిచాడు. 2024లో తన అద్భుత ప్రదర్శనలతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఈ 24 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు ఈ ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. అజ్ముతుల్లా ఒమర్జాయ్‌ (Azmatullah Omarzai) 2024లో ఆఫ్ఘనిస్థాన్‌ తరఫున తన బ్యాటింగ్ , బౌలింగ్ తో సత్తా చాటాడు. 14 వన్డేల్లో 417 పరుగులు 52.4 సగటుతో, 105.06 స్ట్రైక్‌ రేట్‌ సాధించాడు. అలాగే, బౌలింగ్‌లో 17 వికెట్లు పడగొట్టి 20.4 సగటు సాధించాడు. ఈ ప్రదర్శనలతో అజ్ముతుల్లా ఒమర్జాయ్ ఆఫ్ఘనిస్థాన్‌ విజయాలలో కీలక పాత్ర పోషించాడు.

2024లో ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు మొత్తం 14 వన్డేలు ఆడగా, అందులో 8 విజయాలు సాధించింది. బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఐర్లాండ్ వంటి జట్లతో పోటీ పడిన ఆఫ్ఘన్ జట్టు 5 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. ఒక మ్యాచ్‌ లో ఫలితం రాలేదు. ఈ విజయాల్లో అజ్ముతుల్లా ప్రదర్శన ముఖ్యపాత్ర పోషించింది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్థాన్‌ తొలిసారిగా పాల్గొననుంది. ఈ మెగా ఈవెంట్‌లో జట్టు విజయాలకు అజ్ముతుల్లా ఒమర్జాయ్‌పై భారీ ఆశలు ఉన్నాయి. అతడి ప్రదర్శన జట్టును బలపరుస్తుందనే నమ్మకంతో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు ఎదురుచూస్తోంది.

ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అజ్ముతుల్లా ఒమర్జాయ్ ఎంపిక కావడం ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ అభిమానులకు గర్వకారణంగా మారింది. అజ్ముతుల్లా ఒమర్జాయ్ లాంటి ప్రతిభావంతులు జట్టులో ఉంటే, ఆఫ్ఘనిస్తాన్‌ ప్రపంచ క్రికెట్‌లో మరింత మెరుగైన స్థానం సంపాదించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.