posted on Jan 27, 2025 3:27PM
సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్టీసీ జేఏసీ తెలంగాణ ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ కు సమ్మె నోటీసు ఇచ్చింది. బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను కలిసిన ఆర్టీసీ జేఏసీ నేతలు ఆయనకు సమ్మె నోటీసు అందజేశారు.
దీంతో నాలుగేళ్ల తరువాత ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టినట్లైంది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని కార్మీక నేతలు ఆరోపించారు. సర్వీసులో ఉన్న వారి సమస్యలే కాదు, పదవీ విరమణ చేసిన వారి సమస్యలు సైతం అపరిష్కృతంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. పేస్లేలు విషయంలో ముందడుగు పడలేదనీ, డీఏ బకాయిలు చెల్లించలేదని వారీ సందర్భంగా సజ్జనార్ కు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలను సవరిస్తామన్న హామీని పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.