Leading News Portal in Telugu

Puri Jagannath is planning a multi-starrer film


Puri Jagannadh: మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్న పూరి జగన్నాథ్..!

టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి దాదాపు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలకు మంచి హిట్ కం బ్యాక్ ఇచ్చాడు. అంతే కాదు వాళ్ళ అందరితో కూడా పూరి జగన్నాధ్ రెండు రెండు సినిమాలు చేయడం విశేషం. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన పూరి జగన్నాథ్ ఇప్పుడు డౌన్ అయిపోయాడు. వరుసగా లైగర్,డబుల్ ఇస్మార్ట్.. సినిమాలతో ప్లాపులు పడడంతో, ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలు.. ప్రేక్షకులు మునుపటిలా ఉత్సహం చూపించడం లేదు. అంతగా పూరి మార్కెట్ పడిపోయింది. ఇక తాజాగా ఈసారి భారీ విజయాన్ని సాధించడానికి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు మన దర్శకుడు.

సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ మల్టీస్టారర్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. మరి ఆ హీరోలు ఎవరు అనే విషయానికి వస్తే.. పూరి తన కొడుకు తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తన కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలు చేసినప్పటికి ఒక హిట్ కూడా కొట్టలేదు. ఒకప్పుడు మన తెలుగు హీరోలందరూ స్టార్లుగా మారాలంటే పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయేవారు. ఇప్పుడు తన కొడుకు విషయంలో కూడా అదే చేయబోతున్నాడట. ఆకాష్ తో పాటు ఈ సినిమాలో మరొక యంగ్ హీరో కూడా ఉండబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి గురించి అధికారికంగా  ప్రకటన రావాల్సి ఉంది.