Leading News Portal in Telugu

Anjali and Varalakshmi Sarathkumar are the heroines whose remuneration has been fixed in live.


Madha Gaja Raja: లైవ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకున్న హీరోయిన్ లు..

త‌మిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం ‘మదగజరాజ’.సుందర్ సీ ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమా నిజానికి 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికి, 12 ఏండ్ల త‌ర్వాత రీసెంట్‌గా త‌మిళంలో విడుద‌లైంది. ఊహించని విదంగా త‌మిళంలో హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ నేప‌థ్యంలోనే తెలుగులో కూడా  ఈ జ‌న‌వ‌రి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం ప్రమోష‌న‌ల్ కార్యక్రమాల‌ను మొద‌లుపెట్టింది. ఇందులో భాగంగా విక్టరీ వెంక‌టేష్ చేతుల మీదుగా ఈ చిత్రం తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయించారు. సంతానం కామెడీ న‌వ్వులు పూయిస్తోంది. విశాల్ డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. మొత్తంగా ట్రైల‌ర్ అదిరిపోయింది.ఈ మూవీలో విశాల్‌, సంతానం, వ‌రల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, అంజ‌లిలు ప్రధాన పాత్రలో న‌టించిన ఈ చిత్రంలో సోనూసూద్ కీల‌క పాత్రను పోషించారు.

అయితే తాజాగా ప్రేస్ మీట్‌లో పాల్గోన్నారు మూవీ టీం ఇందులో భాగంగా హీరోయిన్ అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కు అక్కడి రిపోర్టర్‌లు.. ‘ ఈ మూవీ 12 ఇయర్స్ ముందు చేశారు. ఇప్పుడు మీరు ఇద్దరు మంచి పొజిషన్ లో ఉన్నారు కదా రెమ్యూనరేషన్ ఏమైనా పెంచారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం ఇస్తూ ఇద్దరు హీరోయిన్లు అక్కడ ఉన్న నిర్మాతని అడిగారు. ‘సార్ చెప్పండి పెంచుతారా’ అని అడిగారు. దానికి సమాధానం ఇచ్చిన నిర్మిత తెలుగులో కూడా మూవీ హిట్ అయితే కచ్చితంగా ఇస్తా అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.