ఫిబ్రవరి మొదటి వారంలో హైడ్రా పోలీస్ స్టేషన్ | HYDRA POLICE STATION IN FEBRAURY 1ST WEEK| ALL| LAND| RELATED| CASES
posted on Jan 28, 2025 11:28AM
హైడ్రా పోలీసు స్టేషన్ ఫిబ్రవరి మొదటి వారానికల్లా అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ లోని బుద్ధభవన్ పక్కన ఈ పోలీసు స్టేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశాలున్నాయి. తాజాగా ఈ పోలీసు స్టేషన్ ప్రాంగణాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. భూ కజ్జాలు, ఆక్రమణలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఆస్తుల పరిరక్షణ సహా హైడ్రా కార్యకలాపాలకోసం ఒక ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ ఈ నెల 7న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఏసీపీ స్థాయి అధికారి ఉంటారు. ఈ హైడ్రా పోలీసు స్టేషన్ కు సిబ్బంది కేటాయింపు. ప్రక్రియ జరుగుతోంది. గతంలో భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులన్నీ స్థానిక పోలీసు స్టేషన్లలో నమోదు చేసేవారు. ఇప్పుడు అటువంటి కేసులను హైడ్రా పోలీసు స్టేషన్ ఎస్ హెచ్ వోకు కమిషనర్ బదలాయించనున్నారు. భూ సంబంధిత కేసులను ఇక నుంచి హైడ్రా పోలీసు స్టేషన్ చూస్తుంది. ఫిర్యాదుల సంఖ్య, అవసరాలను బట్టి మరిన్ని హైడ్రా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు.