Leading News Portal in Telugu

Infinix Smart 9HD phone released in Indian market


  • ఇన్‌ఫినిక్స్‌ నుంచి మరో కొత్త ఫోన్
  • ధర రూ.6,699 మాత్రమే
  • ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్‌ ప్రారంభం
Infinix Smart 9 HD: ఇన్‌ఫినిక్స్‌ నుంచి మరో కొత్త ఫోన్.. రూ.6,699 మాత్రమే!

న్యూ ఇయర్ ఆరంభంలోనే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లు మొబైల్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటున్నాయి. రూ. 10 వేల కంటే తక్కువ ధరలోనే మొబైల్స్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. తాజాగా మరో మొబైల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ ఫినిక్స్ 7 వేల కంటే తక్కువ ధరలో ఇన్ ఫినిక్స్ స్మార్ట్ 9హెచ్డీ ఫోన్ ను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. దీని ధర రూ.6,699 మాత్రమే. చౌక ధరలో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Infinix Smart 9 HD ఫోన్ మింట్ గ్రీన్‌, కోరల్‌ గోల్డ్‌, నియో టైటానియం, మెటాలిక్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ఇది 90 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 6.7 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్‌ తో వస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, DTS ఆడియో ప్రాసెసింగ్ ఉన్నాయి. స్మార్ట్ 9 హెచ్‌డి IP54 రేటింగ్‌తో వస్తుంది. ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్‌ 9 హెచ్‌డీ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హెలియో జీ50 ప్రాసెసర్‌ విత్‌ 2.2 హెర్ట్జ్‌ పీక్‌ క్లాక్‌ స్పీడ్‌తో వస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్‌ ప్రారంభం కానుంది.

6GB RAM (3GB ఫిజికల్ + 3GB వర్చువల్), 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1TB వరకు విస్తరించవచ్చు. ఫోటోగ్రఫీ కోసం, Infinix Smart 9 HD క్వాడ్ LED, జూమ్ ఫ్లాష్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. ఫోన్ 5,000mAh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. ఇది 14.5 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 8.6 గంటల గేమింగ్‌ను అందించగలదని కంపెనీ తెలిపింది. Infinix Smart 9 HDలో Wi-Fi, బ్లూటూత్, USB టైప్-C, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.