Leading News Portal in Telugu

Eating mustard oil reduces joint pain


  • ఆవాల నూనెలో అనేక ప్రయోజనాలు
  • దినచర్యలో భాగం చేసుకుంటే మేలు
  • ఆర్థరైటిస్, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులను ఉపశమం
Mustard Oil Benefits: ఆవ నూనె వంటలో వాడండి.. కీళ్ల నొప్పులు ఇట్టే మాయం?

ఆవాల నూనెలో బ్యూటీ నుంచి హెల్త్ వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దానిని మీ దినచర్యలో భాగం చేసుకుంటే.. మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ నూనెను వంటకు ఎంచుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. ఆవనూనెలో అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉండటం వల్ల వంటగదిలో ఇది చాలా అవసరం. అదనంగా ఇది తక్కువ సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది. ఇది అతి ముఖ్యంగా కీళ్ల నొప్పులకు బాగా పనిచేస్తుంది.

READ MORE: Indiramma houses: ఇందిర‌మ్మ ఇళ్లకు ఇసుక స‌ర‌ఫ‌రాపై అధ్యయ‌నం.. క‌మిటీ నియామ‌కం

ఆర్థరైటిస్, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులను ఉపశమం పొందడానికి ఆవ నూనె సహాయపడుతుంది. ఆవ నూనెలో ఉండే.. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్‌ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీరంలో వాపును తగ్గించి.. నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. అర్థరైటిస్‌ నొప్పి, కీళ్ల నొప్పి తగ్గాలంటే.. చిన్న మంటపై ఆవ నూనె వేడి చేసి.. ప్రభావిత ప్రాంతంలో మసాజ్‌ చేయండి. ఆవ నూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల కండరాలు, కీళ్ళు నొప్పి తగ్గుతాయి. దీంతో పాటు ఈ నూనె తీసుకోవడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.. గుండెకు మంచి చేస్తుంది. నోటి ఆరోగ్యానికి మేలు. క్యాన్సర్‌ కణాలతో పోరాడుతుంది.. ఆస్తమా లక్షణాలు తగ్గిస్తుంది.. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది..

READ MORE: Thala: నరాలు కాదు.. ‘తల’లు తెగే ఉత్కంఠ.. ఏమన్నా ఉందా ట్రైలర్?