Leading News Portal in Telugu

SL vs AUS 1st Test: Steve Smith joins 10000 Runs Club in Tests


  • స్మిత్ కెరీర్‌లో అరుదైన మైలురాయి
  • టెస్ట్ ఫార్మాట్‌లో 10 వేల రన్స్ పూర్తి
  • ఐదవ బ్యాటర్‌గా స్మిత్ రికార్డు
Steve Smith: అరుదైన మైలురాయికి అందుకున్న స్టీవ్ స్మిత్.. రికార్డులే రికార్డులు!

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కెరీర్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 10 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ ఈ మార్క్‌ను అందుకున్నాడు. ప్రబాత్ జయసూర్య వేసిన 31 ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసిన స్మిత్.. సాంప్రదాయ ఫార్మాట్‌లో 10 వేల రన్స్ పూర్తి చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్న స్మిత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

టెస్ట్ ఫార్మాట్‌లో 10 వేల పరుగులను పూర్తి చేసిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. దిగ్గజాలు అలన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్‌లు స్మిత్ కంటే ముందున్నారు. మొత్తంగా 10 వేల పరుగులను పూర్తి చేసిన 15వ బ్యాటర్‌గా రికార్డుల్లో ఉన్నాడు. 10 వేల టెస్ట్ పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన ఐదవ బ్యాటర్‌గా (205 ఇన్నింగ్స్‌లు) కూడా నిలిచాడు. ఈ జాబితాలో బ్రియాన్ లారా (195) అగ్రస్థానంలో ఉన్నాడు. 35 ఏళ్ల స్మిత్ 55 కంటే ఎక్కువ సగటుతో 10 వేల రన్స్ చేశాడు. కుమార సంగక్కర మాత్రమే (57.40) స్మిత్ కంటే ముందున్నాడు.