Leading News Portal in Telugu

England Women U19 have won the toss and have opted to bat against India Women U19


  • ఇంగ్లండ్‌, భారత్ జట్ల మధ్య రెండో సెమీస్
  • బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్
  • మొదటి సెమీస్‌లో విజేతగా దక్షిణాఫ్రికా
IND Vs ENG: బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్.. భారత్ తుది జట్టు ఇదే!

అండర్-19 మహిళల ప్రపంచకప్ 2025 రెండో సెమీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో ఇంగ్లండ్‌, భారత్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ అబీ నారోగ్రోవ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ప్రపంచకప్‌లో జోరుమీదున్న భారత జట్టును ఆపడం ఇంగ్లండ్‌కు పెను సవాలే. టోర్నీలో అపజయమే లేని భారత్‌ సెమీస్‌లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది.

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. గ్రూప్‌ దశలో వెస్టిండీస్, మలేసియాలను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన టీమిండియా.. శ్రీలంకను 60 పరుగుల తేడాతో ఓడించింది. సూపర్‌ సిక్స్‌లో బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో, స్కాట్లాండ్‌పై 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ ఫామ్‌లో ఉన్న భారత జట్టుకు విజయం కష్టమేమీ కాదు. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషపై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలర్లు వైష్టవి శర్మ, ఆయూషి శుక్లా ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. మొదటి సెమీస్‌లో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది.

తుది జట్లు:
భారత్: కమలిని (వికెట్ కీపర్), గొంగడి త్రిష, సనికా చల్కే, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఐష్వరి, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత, షబ్నమ్ షకిల్, పరునికా సిసోదియా, వైష్ణవి శర్మ.
ఇంగ్లండ్‌: డేవినా సారా పెర్రిన్, జెమీమా స్పెన్స్, ట్రుడే జాన్సన్, అబీ నారోగ్రోవ్ (కెప్టెన్), స్టబ్స్, కేటీ జోన్స్ (వికెట్ కీపర్), ప్రిషా, టిల్లే, ఫోబ్‌ బ్రెట్, ఛార్లెట్ లాంబెర్ట్, సురేంకుమా.