US Airstrike Kills Al-Qaeda Leader in Syria, Hamas Confirms Death of Military Chief in Israeli Strike
- సిరియాపై అమెరికా వైమానిక దాడి.
- దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్ హతం.

US Airstrike On Syria: సిరియాలోని వాయువ్య ప్రాంతంలో గురువారం జరిగిన వైమానిక దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను అమెరికా సైన్యం హతమార్చింది. తీవ్రవాద గ్రూపులను నాశనం చేసి వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ వైమానిక దాడి జరిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. జబీర్ అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన హుర్రాస్ అల్-దిన్ అనే గ్రూప్‌తో అతను సంబంధం కలిగి ఉన్నాడు.
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ గురువారం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తమ సైనిక చీఫ్ మహ్మద్ దైఫ్ మరణించినట్లు ధృవీకరించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించిన నెలల తర్వాత ఈ నిర్ధారణ వచ్చింది. నివేదిక ప్రకారం, హమాస్ ప్రతినిధి అబు ఒబైదా వీడియో ప్రకటనలో దైఫ్ మరణాన్ని ధృవీకరించారు. జూలై 13న ఖాన్ యునిస్ ప్రాంతంలో వైమానిక దాడిలో మహ్మద్ దైఫ్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ ఆగస్టు 2023లో ప్రకటించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో 1200 మందికి పైగా మరణించారు. వారిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారు. అంతేకాకుండా వందల మంది కిడ్నాప్‌కు గురయ్యారు. దీని తరువాత, ఇజ్రాయెల్ హమాస్‌కు ప్రతీకారంగా గాజాలో 46000 మందికి పైగా పాలస్తీనియన్లను మట్టుపెట్టింది.
ఇటీవల గాజాలో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం బందీలు, ఖైదీల మార్పిడి జరిగింది. గురువారం నాడు 110 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా ఇజ్రాయెల్ నుండి 8 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. వీరిలో ఐదుగురు థాయ్ వ్యవసాయ కార్మికులు, ముగ్గురు జర్మన్-ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు.