Leading News Portal in Telugu

Hamas announces release of three more hostages tomorrow


  • రేపు మరో ముగ్గురు బందీలఉ విడుదల
  • బందీల పేర్లు వెల్లడించిన హమాస్
Hamas-Israel: రేపు మరో ముగ్గురు బందీలను విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటన

హమాస్-ఇజ్రాయెల్ మధ్య మార్పిడి ఒప్పందం కొనసాగుతోంది. అంతర్జాతీయ మధ్యవ్యర్తుల సాయంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో ప్రస్తుతం బందీ విడుదల-ఖైదీల అప్పగింత కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు బందీలను విడుదల చేయగా.. ఇటువైపు నుంచి పాలస్తీనా ఖైదీలను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రశాంతంగా సాగుతోంది.

ఇది కూడా చదవండి: Kerala: ప్రియుడి ఆకృత్యం.. క్రూరమైన లైంగిక దాడిలో ప్రియురాలి మృతి

తాజాగా ఫిబ్రవరి 1న ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. విడుదల చేసే ముగ్గురు బందీల పేర్లును వెల్లడించింది. కీత్ సీగెల్, ఓఫర్ కల్డెరాన్, యార్డెన్ బిబాస్‌గా పేర్కొన్నారు. ప్రస్తుతం హమాస్.. వంతుల వారీగా బందీలను విడుదల చేస్తున్నారు. ఇటీవల ఎనిమిది బందీలను విడుదల చేశారు. అయితే బందీల అప్పగింత సమయంలో హమాస్ ఉగ్రవాదులు ఇబ్బందులు పెడుతున్నట్లుగా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ తీరును ఇజ్రాయెల్ ఖండించింది. ఈ విషయంలో అంతర్జాతీయ మధ్యవర్తులు జోక్యం పుచ్చుకోవాలని డిమాండ్ చేసింది.

ఇది కూడా చదవండి: IND vs ENG 4th T20: దూబే, హార్దిక్ మెరుపులు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

అక్టోబర్ 7, 2023లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి పలువురిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ అంతమే లక్ష్యంగా దాడులు చేసింది. వందలాది మంది పాలస్తీనీయులు హతమయ్యారు. తాజాగా ఇరు దేశాల మధ్య ఒప్పందం జరగడంతో క్షేమంగా బందీలు ఇంటికి చేరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: KumbhMela Special Trains: కుంభమేళా భక్తుల కోసం 06 ప్రత్యేక రైళ్లు.. ఏ స్టేషన్లలో హాల్టింగ్ ఉందంటే.?