Leading News Portal in Telugu

Black Box Recovered from Washington DC Airplane Crash Investigation Continues


Washington DC Plane Crash:  మిస్టరీ వీడనుంది… అమెరికన్ విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరికింది

Washington DC Plane Crash: వాషింగ్టన్ డీసీలో బుధవారం రాత్రి జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ (H-60) ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రయాణికులు మరణించారు. జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB) దర్యాప్తును చేపట్టింది. శుక్రవారం నాటికి 28 మంది మృతదేహాలను గుర్తించగా, 41 మృతదేహాలను నీటిలోనుండి వెలికి తీశారు. విమానం నది అడుగుభాగంలో ఉన్నందున మిగతా మృతదేహాలు ఇంకా లభించలేదు. బ్లాక్ బాక్స్ లోని ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ డేటా విశ్లేషణ ద్వారా ప్రమాదానికి గల అసలు కారణం బయటపడే అవకాశం ఉంది.

బ్లాక్ బాక్స్ దొరికింది, కానీ తేమతో నిండింది
NTSB సభ్యుడు టాడ్ ఇన్మాన్ మాట్లాడుతూ.. “బ్లాక్ బాక్స్ దొరికింది కానీ అది తేమతో నిండిపోయింది. దానిలోని డేటాను పూర్తిగా విశ్లేషించడానికి కొన్ని రోజులు పడుతుంది” అని తెలిపారు.

హెలికాప్టర్ ఎందుకు ఢీకొట్టింది?
ఈ ప్రమాదానికి హెలికాప్టర్ కారణమా? లేక ఇతర సాంకేతిక లోపమా? అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం తర్వాత విమాన శకలాలు పోటోమాక్ నదిలో పడిపోయాయి. వాషింగ్టన్ రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ల్యాండ్ కావాల్సిన ఈ విమానం కాన్సాస్ సిటీ నుండి వాషింగ్టన్ కు వస్తోంది.

ప్రమాదంపై ట్రంప్ ప్రశ్నలు
ఈ విమాన ప్రమాదంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. “ఆకాశం నిర్మలంగా ఉన్నా, ఈ ప్రమాదం ఎలా జరిగింది? హెలికాప్టర్ ఎందుకు విమానం వైపుగా కదిలింది? పైలట్ ఎందుకు తప్పించుకోలేకపోయాడు?” అని ప్రశ్నించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్ లో ఉన్నారు. వైట్ హౌస్ నుండి విమానాశ్రయం కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. NTSB దర్యాప్తు పూర్తి అయిన తర్వాత మాత్రమే అసలు నిజం బయటకు రానుంది.