Leading News Portal in Telugu

BSF stops illegal construction of bunker by Bangladesh forces along border


  • సరిహద్దుల్లో బంగ్లాదేశ్ అక్రమ నిర్మాణాలు..
  • అడ్డుకున్న బీఎస్ఎఫ్..
India-Bangladesh: బంగ్లాదేశ్ అక్రమ బంకర్ నిర్మాణం.. అడ్డుకున్న బీఎస్ఎఫ్..

India-Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ అతి చేస్తోంది. ముఖ్యంగా తన స్థాయి ఏమిటో మరిచిపోయి భారత్‌కి వార్నింగ్ ఇస్తోంది. అక్కడి జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్ వంటి మతోన్మాద, తీవ్రవాద సంస్థలు భారత దేశాన్ని బెదిరించేలా ప్రకటనలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఆ దేశం క్రమక్రమంగా పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకుంటూ భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది. రానున్న రోజుల్లో ‘‘ఇస్లామిక్ రిపబ్లిక్’’గా మారేందుకు సిద్ధమవుతోంది.

ఇదే కాకుండా, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళం ‘‘బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బీజీబీ)’’ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మిస్తున్న బంకర్‌ని మన ‘‘బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)’’ అడ్డుకుంది. ఇటీవలి వారాల్లో, మేఖ్లిగంజ్, కూచ్ బెహార్‌లోని సరిహద్దు సమీపంలో బంగ్లాదేశ్ నిర్మాణాలను పెంచింది. జనవరి 31న, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ దహ్గ్రామ్ అంగార్‌పోతా ప్రాంతంలో సెంట్రీ పోస్ట్ బంకర్ నిర్మించడానికి ప్రయత్నించింది. BSF అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిర్మాణం ఆగిపోయింది. ఫుల్కదబరి, మేఖ్లిగంజ్‌లో, నిషేధిత జోన్‌లో ఒక అక్రమ ఇల్లు కూడా నిర్మిస్తున్నారు.

గత వారం సరిహద్దు వెంబడి కూచ్ బెహార్‌లోని కుచ్లిబారిలోని జికాబారి ప్రాంతంలో రెండు ఇళ్ళు నిర్మించింది, బీఎస్ఎఫ్ గట్టిగా చెప్పడంతో బంగ్లాదేశ్ వీటి నిర్మాణాలను ఆపేపింది. నిజానికి రెండు దేశాల సరిహద్దు ఒప్పందం ప్రకారం, సరిహద్దుకు అటూ ఇటూ 150 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలను నిర్మించకూడదు. అయితే, వీటిని ఉల్లంఘిస్తూ బంగ్లాదేశ్ ప్రవర్తిస్తోంది.