posted on Feb 1, 2025 10:34AM
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని లోక్ సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. అనంతరం వాకౌట్ చేశారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించిన నిర్మలా సీతారామన్ వారు వాకౌట్ చేసినా పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు.
– 7.7 కోట్ల మందికి ప్రయోజనం కలిగే విధంగా కిసాన్ కార్డుల పరిమితిని 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
– అలాగే ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేశారు. ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలను రూ. 5 నుంచి రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
– స్టార్టప్ లకు రుణాల పరిమితిని పది కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు.
– ఇది కాకుండా బొమ్మల తయారీకి ఒక ప్రత్యేక పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు.