Leading News Portal in Telugu

Ind vs Eng 5th T20 England target 248 Runs


  • ఐదో టీ20 మ్యాచ్ లో దంచికొట్టిన భారత్
  • ఇంగ్లండ్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యం
Ind vs Eng 5th T20: దంచికొట్టిన భారత్.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్

వాంఖడే స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇంగ్లీష్ జట్టుకు చుక్కలు చూపించింది. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన టీమిండియా కుర్రాళ్లు భారీ స్కోర్ అందించారు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్థేశించింది. యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తు చేస్తూ కేవలం 37 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీని సాధించాడు.

అభిషేక్ శర్మ 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సులు బాది 135 పరుగులు సాధించాడు. తిలక్ వర్మ24, దూబె 30,శాంసన్ 16, సూర్య 2, పాండ్య 9, రింకు 9,అక్షర్ 15 పరుగులు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్సే 3, వుడ్2, ఆర్చర్, రషీద్, ఓవర్టన్ తలో వికెట్ తీశారు. ఐదు టీ20ల సిరీస్ లో భారత్ 3-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఆఖరి మ్యాచ్ లో విక్టరీ కొట్టాలని పట్టుదలతో ఉంది.