Leading News Portal in Telugu

CM Chandrababu, Deputy CM pawan kalyan congratulates Under-19 India Women’s team.


  • అండర్- 19 భారత మహిళా క్రికెట్ జట్టుకి‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
  • ఈ విజయం దేశ మహిళలకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది- పవన్
  • భారత జట్టుకు అభినందనలు తెలిపిన మంత్రి నారా లోకేష్
  • భారత మహిళల జట్టు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి- లోకేష్.
U19 Womens T20 World Cup: అండర్-19 భారత్ మహిళల జట్టుకు సీఎం, డిప్యూటీ సీఎం అభినందనలు..

అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే.. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. కౌలాలంపూర్ వేదికగా జ‌రిగిన ఫైన‌ల్లో 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా అండర్-19 భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. కటోర శ్రమ, అంకిత భావం, దేశభక్తి వారి ఆటలో ప్రదర్శించారని పేర్కొన్నారు. అందుకే తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై మరచిపోలేని విజయాన్ని అందించారని అన్నారు. ఈ విజయంతో ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలా ఆట ఆడారు.. కేవలం దేశానికి పేరు తేవడమే కాకుండా, లెక్కలేనంత మంది మహిళా క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారని సీఎం తెలిపారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందంటూ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

Kejriwal: బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం.. గూండాయిజం చేస్తోందని ఆరోపణలు!

ఆంధ్రప్రదేశ్ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. మలేసియాలో జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌లో విజయం సాధించిన అండర్ 19 భారత మహిళా క్రికెట్ జట్టుకి‌ శుభాకాంక్షలు తెలిపారు. వారి అంకితభావం, వారు సాధించిన విజయం దేశ మహిళలకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబర్చిన గొంగడి త్రిషకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత జట్టులోని ప్రతీ ఒక్కరికీ తన హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు పవన్ కల్యాణ్.

Annamaya District: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్..

మరోవైపు.. మంత్రి నారా లోకేష్ భారత జట్టుకు అభినందనలు తెలిపారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టి రెండోసారి మహిళల అండర్-19 టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు. సమిష్టి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించి అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని అన్నారు. టోర్నీ మొత్తం తనదైన బ్యాటింగ్, బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష అందరికీ గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. భారత మహిళల జట్టు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.