Leading News Portal in Telugu

‘Not Seen A Better T20 Hundred Than Abhishek’s’: Gautam Gambhir Praises Star Indian Opener


  • ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో అభిషేక్ శర్మ తుఫాను ఇన్నింగ్స్
  • సిక్సులు, ఫోర్లతోనే డీల్
  • అభిషేక్ ఇన్నింగ్స్‌పై గౌతమ్ గంభీర్ ప్రశంసలు.
Team India: ఇలాంటి ఇన్నింగ్స్ ఎప్పుడూ చూడలేదు.. అభిషేక్ శర్మపై ప్రశంసల జల్లు

ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు.. సిక్సులు, ఫోర్లతోనే డీల్ చేశాడు. అభిషేక్‌ను ఔట్ చేసేందుకు ఇంగ్లాండ్ బౌలర్లు చెమటోడ్చినా.. చివరి వరకూ ఉండి జట్టుకు భారీ స్కోరును అందించాడు. అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. 37 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. టీ20 అంతర్జాతీయ చరిత్రలో మూడవ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్‌ తరఫున అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌ రికార్డు అభిషేక్‌ పేరిట నమోదైంది. కాగా.. అభిషేక్ ఇన్నింగ్స్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు.

మ్యాచ్ అనంతరం అభిషేక్ ఇన్నింగ్స్ గురించి జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. టీ20లో ఇలాంటి ఇన్నింగ్స్‌ను తానెప్పుడూ చూడలేదన్నారు. ‘ఇలాంటి టీ20 సెంచరీని నేనెప్పుడూ చూడలేదు. అది కూడా 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ వంటి బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఇదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం. ఫియర్‌లెస్ క్రికెట్‌తో ముందుకు సాగాలనుకుంటున్నాం. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు మేం అండగా నిలవాలనుకుంటున్నాం. 140-150 కోట్ల భారతీయులకు ప్రాతినిథ్యం వహించడం అంటే ఏమిటో మా ఆటగాళ్లకు బాగా తెలుసు.’ అని గంభీర్ చెప్పాడు.