Leading News Portal in Telugu

చిత్తూరులో రోడ్డు ప్రమాదం- నలుగురు మృతి | road accident in chittooe district| four| dead| tiruoathi| chennai| national


posted on Feb 3, 2025 10:51AM

చిత్తూరు జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి  జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. తిరుపతి, చెన్నై జాతీయ రహదారిపై లాడీ, ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మందికి పైగానే తీవ్రంగా గాయపడ్డారు.  తీవ్రంగా గాయపడిన బాధితులను నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థతి ఆందోళనకరంగా ఉన్న వారిని తిరుపతి ఆస్పత్రికి తరలించారు. 

మృతులను వడమాలపేట సీతారామాపురం గ్రామానికి చెందిన పార్థసారధి నాయుడు, , రాజేంద్రనాయుడు, తిరుపతికి చెందిన మణిగండగా గుర్తించారు. మరో వ్యక్తిని గుర్తించాల్సి ఉంది.