Leading News Portal in Telugu

US will take over Gaza, we will own it, We will develop: Donald Trump


  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..
  • గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటామని వెల్లడి..
  • గాజాను సొంతం చేసుున్న తర్వాత అభివృద్ధి చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
Donald Trump: గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటాం.. డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump: ఇజ్రాయెల్‌, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో ట్రంప్‌ సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన విడుదల చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనాలో భూభాగమైన గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తుంది పేర్కొన్నాడు. దీంతో, అతడి వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. పాలస్తీనియన్లు వేరే చోట స్థిరపడిన తర్వాత అమెరికా గాజా స్ట్రిప్‌ను హస్తగతం చేసుకుంటుందని తెలిపాడు. గాజాను అమెరికా సొంతం చేసుకున్న తర్వాత అభివృద్ధి చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించాడు.

ఇక, గాజాలో పరిస్థితులను పరిశీలిస్తున్నట్టు ట్రంప్ చెప్పాడు. గాజాలో యుద్ధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నామని పేర్కొన్నాడు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపాడు. గాజా ప్రాంత ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, గృహాలను అందజేసే ఆర్థిక అభివృద్ధిని సృష్టించే బాధ్యత అమెరికాది అని హామీ ఇచ్చాడు. ఇదే సమయంలో భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ పర్యటన సందర్భంగా గాజా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాను సందర్శించాలని తాను భావిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు.