Leading News Portal in Telugu

Former Team India head coach Rahul Dravid car collision with Auto


  • రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం
  • కారును ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం
  • ద్రవిడ్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్
Rahul Dravid: టీమిండియా మాజీ హెడ్ కోచ్ కారుకు ప్రమాదం..

భారత మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్, టీ20 ప్రపంచ కప్ 2024 విజేత జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. రాహుల్ ద్రవిడ్ ప్రయాణిస్తు్న్న కారును ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం తెలియగానే ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో రాహుల్ ద్రవిడ్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ ప్రమాదం అనంతరం ద్రవిడ్ ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదానికి కారణం.. ద్రవిడ్ డ్రైవింగ్ నిర్లక్ష్యమా లేదా ఆటో డ్రైవర్ డ్రైవింగ్ నిర్లక్ష్యమా అనేది స్పష్టంగా తెలియలేదు. చిన్న ప్రమాదమే కావడంతో ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇక 2021లో టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలను స్వీకరించాడు. అతని శిక్షణలో జట్టు 2023 ODI ప్రపంచ కప్ ఫైనల్‌కు కూడా చేరుకుంది.