మొరాయించిన ఈవీఎంలు.. ఢిల్లీలో పలు చోట్ల పోలింగ్ కు అంతరాయం | polinig stalled in several places| technical| problem| evms| vvpats| delhi| assembly
posted on Feb 5, 2025 8:44AM
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం (ఫిబ్రవరి 5) ఉదయం మొదలైంది. అయితే పలు చోట్ల పోలింగ్ కు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించడంతో పలు పోలింగ్ నిలిచిపోయింది. ఢిల్లీలోని మాదీపూర్ ప్రాంతంలో వీవీ ప్యాట్ లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పోలింగ్ ను నిలిపివేశారు. అలాగే పలు ఇతర చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించాయి.
ఇదిలా ఉండగా సరిగ్గా పోలింగ్ కు ముందు రోజు ఢిల్లీ సీఎం అతిషిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె ఎన్నికల కోడ్ అతిక్రమించారని పేర్కొంటూ పలు సెక్షన్ల కింద గోవింద్ పూరి పీఎస్ లో కేసు నమోదు అయ్యింది.
ఫతేసింగ్ మార్గ్‌లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతిశీ 50 నుంచి 70 మంది మద్దతుదారులతో పాటు పది వాహనాలతో తిరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోలీసులు సూచించినా ఆమె పట్టించుకోలేదని పేర్కొన్నారు. కాగా తనపై కేసు విషయంలో ఢిల్లీ సీఎం అతిశీ స్పందించారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి, ఆయన మద్దతుదారులూ బహిరంగంగా దాడులకు దిగుతున్నా పోలీసులు, ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు వివక్షతో వ్యవహరిస్తున్నారంటూ ఆమె ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.