Leading News Portal in Telugu

There are many benefits of holding your baby with a kangaroo.


benefits your baby: కంగారూ లాగా మీ పిల్లల్ని హత్తుకొని ఉండటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి..

ప్రస్తుత కాలంలో ప్రతి ఒకటి కలుషితం అవుతుంది. ముఖ్యంగా వాతావరణం ఎంత ప్రమాదకరంగా మారింది అంటే.. దాని మూలంగా ఊహించని రోగాలు పుట్టుకొస్తున్నాయి. దీని వల్ల చిన్న పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. జలుబు, దగ్గుతో పాటు, చర్మ సమస్యలు కూడా బాధపడుతున్నారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లోనే నయం చేయడానికి ప్రయత్నిస్తారు.. అనేక ఇంటి చిట్కాలు పాటిస్తారు. అయితే తాజాగా ఈ సమస్యలపై ఇన్‌స్టాగ్రామ్ లో ఓ రీల్‌ తెగ వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న వీడియెలో నవజాత శిశువును కంగారూ లాగా ఛాతీకి దగ్గరగా ఉంచడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని పేర్కొన్నారు.కంగారూ లాగా ఛాతీకి దగ్గరగా పిల్లలను ఉంచుకుంటే బిడ్డ బరువు పెరుగుతుందని.. చలి నుంచి రక్షణ లభిస్తుందని. కౌగిలించుకోవడం వల్ల బిడ్డకు వెచ్చదనం లభించడంతో పాటు శిశువు మెదడు, నరాలు, ఎముకలు బాగా అభివృద్ధి చెందడానికి సాయపడుతుందని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల తల్లిబిడ్డల అనుబంధం కూడా పెరుగుతుందని వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే, ఇందులో నిజమెంత, డాక్టర్ ఏం చెప్పారో తెలుసుకుందాం..

లోకంలో ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. పుట్టిన ప్రతి బిడ్డ కూడా అలానే. కొంతమంది పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు. మరికొందరు పుట్టినప్పటి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. దీంతో పిల్లలు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులకు రకరకాల అపోహలు మొదలవుతాయి.ఇక ఈ వీడియో లో చెప్పింది ఏదైతే ఉందో అది అక్షరాల నిజం. పిల్లల ఆరోగ్యం బాగుపడాలి, పిల్లలు బాగా పెరగాలంటే ఈ చిట్కాలు పాటించాలి అని సలహా ఇస్తున్నారు. కానీ కొంత మంది పిల్లలని అస్తమానం ఎత్తుకోవడం వల్ల పెరగరు, మన ఒంట్లో వేడి వారికి తగిలి ఎదుగుదల సరిగా ఉండదని చెబుతారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే.

పిల్లలు పుట్టిన సంవత్సరం వరకు నడక రాదు. అలాంటప్పుడు కచ్చితంగా మనం ఎత్తుకుని తిరుగుతాం ఈ టైమ్ లో వారిని కంగారు లాగా హత్తుకొని ఉండటం మంచిది. కానీ ఈ మధ్య కాలంలొ తల్లులు ఎత్తుకోవడం చేతకాక కారింగ్ బ్యాగ్స్ వాడుతున్నారు. అవి తగిలించుకుని పిల్లలని అందులో వేసుకుని తిరుగుతున్నారు. దీని కారణంగా పిల్లలకు తల్లి స్పర్శ తగలడం లేదు. అలాంటప్పుడు వారు ఎలా ఎదుగుతారు. అందుకే ఓపికతో పిల్లలని ఎత్తుకుని తిరగడం నేర్చుకొండి.