posted on Feb 5, 2025 11:32AM
ప్రధాని నరేంద్రమోడీ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ చేరుకున్న ప్రధాని మోడీ బీష్మ అష్ఠమి సందర్భంగా నిర్వహించే గంగా హారతిలో పాల్గొన్నారు. అంతకు ముందు త్రివేణి సంగమంలో ఆయన పుణ్యస్నానం ఆచరించారు.
అనంతరం గంగ హారతి కార్యక్రమంలో పాల్గొని హారతిచ్చారు. బుధవారం(ఫిబ్రవరి 5) ఉదయమే ప్రయాగ్ రాజ్ చేరుకున్న ప్రధాని మోడీకి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం ఆయనను త్రివేణి సంగమం వద్దకు తోడ్కోని వెళ్లారు. అక్కడ సంగం ఘాట్ వద్ద ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు.