ఘోర ప్రమాదం.. మట్టిదిబ్బలు పడి ముగ్గురు మృతి | three workerd dead in cellar digging work| hyderabad| lbnagar| biharworkers| one
posted on Feb 5, 2025 11:15AM
సెల్లార్ తవ్వుతుండగా మట్టిదిబ్బలు పడి ముగ్గురు మరణించిన విషాద ఘటన హైదరాబాద్ లో బుధవారం జరిగింది. ఎల్బీనగర్ లో ఒ హోటల్ సెల్లార్ తవ్వకం పనులు జరుగుతుండగా ఈ ఘోరం జరిగింది.
ఒక్కసారిగా మట్టిదిబ్బలు తవ్వకం పనులలో ఉన్న కార్మికులపై పడటంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో కార్మికులు గాయపడ్డాడు. మృతి చెందిన కార్మికులు ముగ్గురూ బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు.